: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షం
వర్షాకాలం ఆరంభంలోనే వానలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం పడుతోంది. పెందుర్తి, ఆనందపురంలో మరో అర్ధగంటలో పిడుగులు పడే అవకాశం ఉందని, అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని రేగిడి, ఆముదాలవలసలో వర్షం కురుస్తోంది. ఉత్తరకోస్త్రాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మరో 2, 3 రోజుల్లో కోస్త్రాంధ్రకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.