: బాహుబ‌లి ప్ర‌భాస్ ఇప్పుడు ఎలా మారిపోయాడో చూడండి!


బాహుబ‌లి-1, 2 సినిమాల కోసం యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్ మీసాలు,  జుట్టు, గెడ్డం పెంచేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం సాహో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీం అలీ వ‌ద్ద‌కు వెళుతూ త‌న లుక్‌లో మార్పుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తీసిన ప్ర‌భాస్ ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మీసం లేకుండా, నీట్ గా ట్రిమ్ చేసుకొని ఆయ‌న క‌నిపిస్తున్నాడు. ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్న ఈ ఫొటోను సినీ విశ్లేష‌కులు షేర్ చేస్తున్నారు. సాహో కోసమే ప్ర‌భాస్ ఇలా న్యూ లుక్ కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నాడ‌ని అనుకుంటున్నారు.


  • Loading...

More Telugu News