: గుంటూరులో బాలికను అపహరించి జమ్ముకశ్మీర్ తీసుకెళ్లిన ఆటోడ్రైవర్.. నిందితుడి అరెస్ట్
గుంటూరు జిల్లా భట్టిప్రోలులో ఇటీవల లిఖిత (13) అనే బాలిక అదృశ్యమైంది. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు పురోగతి సాధించారు. జమ్ముకశ్మీర్‌లోని సాంబాలో లిఖిత ఉందని గుర్తించిన పోలీసులు ఆ బాలికను ఓ ఆటోడ్రైవర్ అపహరించి తీసుకెళ్లినట్లు తేల్చారు. జమ్ముకశ్మీర్‌కు వెళ్లిన గుంటూరు పోలీసులు ఆటోడ్రైవర్ నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.