: వరల్డ్ టాప్-10 సేవా సంస్థల్లో టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్


ప్రపంచంలోని టాప్ -10 ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థల జాబితాను యూఎస్ కేంద్రంగా నడుస్తున్న హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ విడుదల చేయగా, భారత్ కు చెందిన మూడు సంస్థలు స్థానాన్ని సంపాదించాయి. భారత అతిపెద్ద ఐటీ సేవల సంస్థల్లో నిలిచిన హెచ్సీఎల్ తో పాటు టీసీఎస్, విప్రో, సంస్థలు వరుసగా ఐదు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచినట్టు హెచ్ఎఫ్ఎస్ తన రీసెర్చ్ లో పేర్కొంది. ఈ జాబితాలో ఫ్రాన్స్ కు చెందిన ఆల్ట్రాన్, ఆల్టెన్ లు టాప్ లో నిలువగా, పది కంపెనీల్లో ఎనిమిది సంస్థలు గత ఆరేళ్ల నుంచి బిలియన్ డాలర్ల క్లబ్ లో ఉన్నవేనని హెచ్ఎఫ్ఎస్ తెలిపింది.

 2015లో టీసీఎస్, విప్రోలు మాత్రమే బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందలేకపోయాయని, ఈ సంవత్సరం హెచ్సీఎల్ తో కలసి సత్తా చాటిన ఈ సంస్థలు మెరుగైన రెవెన్యూ గణాంకాలను నమోదు చేశాయని వెల్లడించింది. కాగా, గత సంవత్సరం ఇదే జాబితాలో 1.23 బి. డాలర్ల ఆదాయంతో నాలుగో స్థానంలో నిలిచిన హెచ్సీఎల్, ఈ సంవత్సరం ఒక్క ర్యాంకు దిగజారిందని పేర్కొంది.

  • Loading...

More Telugu News