: ఈ నెల 9 నుంచి ‘పున్నమి ఓర్వకల్లు’ ఫెస్టివల్


ఈ నెల 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు ‘పున్నమి ఓర్వకల్లు’ ఫెస్టివల్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని పురాతన రాక్ గార్డెన్ లో ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ జి.గోపాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యాటక రంగాన్ని మరింత విస్తృతం చేసేందుకు, పర్యాటక ప్రియులను ప్రోత్సహించే నిమిత్తం ఈ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్థానికులతో పాటు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉండే పర్యాటక ప్రియుల కోసం ఈ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News