: బార్‌కెళ్లి బీర్ సీసాలు ప‌డేసిన‌ నెమలి.. మీరూ చూడండి!


ఓ నెమ‌లి బారులోకి వెళ్లి బీర్ సీసాల‌ను ప‌గులకొట్టేసి హ‌ల్‌చ‌ల్ చేసిన ఘ‌ట‌న కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఆ నెమ‌లి గురించి బార్‌ యజమాని జూ అధికారులకు సమాచారం ఇచ్చాడు. జూ సిబ్బంది అక్క‌డికి చేరుకునే లోపు నెమలి దాదాపు రూ.30 వేల ఖరీదైన మద్యం సీసాలను ప‌గుల‌కొట్టేసింది. చివ‌రకి జూ సిబ్బంది దానిని పట్టుకుని తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న గురించి జూ అధికారులు మాట్లాడుతూ ఆ నెమ‌లి అడ‌వి నుంచి త‌ప్పిపోయి ఆర్కాడియా ప్రాంతంలో ఉన్న రాయల్‌ ఓక్‌ లిక్కర్ దుకాణానికి వెళ్లింద‌ని, అది అక్కడి కస్టమర్లపైకి కూడా దూకుతూ వారు బెదిరిపోయేలా చేసింద‌ని చెప్పారు. ఈ నెమ‌లిని ప‌ట్టుకునేట‌ప్పుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.                                                                                        

       

  • Loading...

More Telugu News