: 'బాహుబలి-2'లో నా భార్య కాజల్!: రానా


బాహుబలిలో భల్లాలదేవుడి పాత్రకు కుమారుడిని చూపించారే తప్ప, భార్యను మాత్రం చూపించలేదన్న అంశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చే జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో అడిగిన ఓ ప్రశ్నకు, సరోగసీ విధానంలో 'భద్ర' పుట్టాడని చెప్పిన రానా, అదే ప్రశ్న మరోసారి ఎదురైన వేళ ఆసక్తికర సమాధానం చెప్పాడు. రానా తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ విడుదల సందర్భంగా ఓ అభిమాని "బాహుబలి- 2లో మీ భార్య ఎవరు? మీరీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే" అంటూ ట్వీట్‌ చేశాడు.

దీనికి రానా స్పందిస్తూ, "కాజల్‌..." అని సమాధానం ఇచ్చాడు. ఇక ఈ ట్వీట్ నే రీట్వీట్ చేసిన కాజల్, తానేం చెప్పలేనని అంది. "ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం" అని కామెంట్ పెట్టింది. పోతే, 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో రానాకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ట్విట్టర్ సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News