: మిస్టర్ నెహ్రా, దటీజ్ మై జాకెట్!: యువరాజ్ సింగ్


స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో, డ్రెసింగ్ రూమ్ లో అంత సరదాగానూ ఉంటాడు. అటువంటి యువీ, తాజాగా, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. యువరాజ్ అరంగేట్రం చేసిన తొలి నాళ్లలో దిగిన ఈ ఫొటోలో ఆశిష్ నెహ్రాతో పాటు మరో మిత్రుడు ఉన్నాడు. ఈ ఫొటోలో నెహ్రా ధరించిన జాకెట్ తనదేనని యువీ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ‘సీరియస్ త్రో బ్యాక్! మిస్టర్ నెహ్రా దటీజ్ మై జాకెట్...’ అని ఫొటోతో పాటు యువీ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ను ఇప్పటికే ఒక లక్షా నలభై వేల మంది చూశారు.

  • Loading...

More Telugu News