: ఇండిగో రూ. 899, ఎయిర్ ఏషియా రూ. 1,099, జెట్ ఎయిర్ వేస్ రూ. 1,111... ఆఫర్ల వెల్లువ


విమాన ప్రయాణికుల ముందు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. గత వారంలో ఎంపిక చేసిన విమానాల్లో ఒక వైపు ప్రయాణానికి రూ. 899కే టికెట్లను అందిస్తామని ఇండిగో, రూ. 1,099కే ఎయిర్ ఏషియా విమానం టికెట్లను ఆఫర్ చేయగా, తాజాగా ఆ జాబితాలో జెట్ ఎయిర్ వేస్ కూడా చేరిపోయింది. 'ఇట్స్ రైనింగ్ డీల్స్' పేరిట ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 20 వరకూ చేసే ప్రయాణాలపై రూ. 1,111కి టికెట్లను 9వ తేదీలోగా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ నడుపుతున్న అన్ని విమానాల్లో ఈ ప్రత్యేక ఫేర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే, ఎన్ని సీట్లను ఆఫర్ చేస్తున్నామన్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఇంటర్ లైన్, కోడ్ షేర్ సర్వీసుల్లో డిస్కౌంట్లు వర్తించవని కూడా జెట్ ఎయిర్ వేస్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News