: ఉగ్రవాదిగా మారితే అమ్మాయిల మదిలో హీరోయేనట... పోలీసు విచారణలో డానిష్ అహ్మద్!


గత నెలలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, బుర్హాన్ వనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న సబ్జార్ భట్ ఎన్ కౌంటర్ అనంతరం, అతని అంత్యక్రియల్లో హల్ చల్ చేసి, పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన డానిష్ అహ్మద్, కేవలం అమ్మాయిలు హీరోగా చూస్తారని ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడవ సంవత్సరం చదువుతున్న అహ్మద్, సైన్యంపై జరిగిన రాళ్ల దాడుల్లో కూడా పాల్గొన్నాడు.

ఉగ్రవాదులతో కలసి తిరిగే యువకులను స్థానిక అమ్మాయిలు హీరోలుగా భావించి స్నేహం చేస్తారని, అందుకోసమే పలువురు యువకులు ఉగ్రవాదం వైపు వెళ్తున్నారని చెప్పాడు. ఆపై లొంగిపోయేందుకు చూసినా, స్థానిక హిజ్బుల్ కమాండర్లు ఎక్కడ చంపుతారోనన్న భయం వారిని వెంటాడుతూ ఉంటుందని తెలిపాడు. స్థానికంగా వచ్చే గొడవలను పరిష్కరించడం వంటి పనుల ద్వారా తమకు కావాల్సిన నిధులను 'ప్రొటెక్షన్ మనీ' పేరిట టెర్రరిస్టులు వసూలు చేస్తుంటారని డానిష్ అహ్మద్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News