: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు!
భూ ఆక్రమణల కేసులో అరెస్టు అయిన ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో, దీపక్ రెడ్డితో పాటు ఆయన న్యాయవాది శైలేంద్ర సక్సేనాను కూడా జైలుకు తరలించారు. కాగా, ఈ స్కామ్ తో తనకేమీ సంబంధం లేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని, తన ఫింగర్ ప్రింట్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, దీపక్ రెడ్డిపై గతంలో ఆరు కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మూడు, అసిఫ్ నగర్, సీసీఎస్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఇనాం భూములు తనవేనంటూ కోర్టులో కేసులు వేసి, చనిపోయిన వ్యక్తుల పేర్లతో నకిలీ పత్రాలను తన న్యాయవాది సాయంతో దీపక్ సృష్టించారు.