: నేను మాంసం తింటాను... ఎవరి తిండి వారిష్టం!: వెంకయ్యనాయుడు


తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మాంసాహారినేనని, ఎవరు ఏం తినాలన్న విషయం వారి ఇష్టమని, భారతీయులను శాకాహారులుగా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శలు అర్థరహితమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పశువధపై దేశంలో చర్చ జరుగుతున్న వేళ, వెంకయ్య నోటి వెంట ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకూ మాంసాహారినేనని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో సైనికులపై రాళ్లు రువ్వుతున్న నిరసనకారులపై సానుభూతి కురిపిస్తూ సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు ఖండించారు. వారికి రాళ్లు రువ్వే వారిపై సానుభూతి ఉన్నట్టు కనిపిస్తోందని, దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులపై సానుభూతి చూపడం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News