: పవన్ కల్యాణ్ తో మాట్లాడే బాధ్యతను కాపు నేతకు అప్పగించిన వైఎస్ జగన్!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, పవన్ తో చర్చలు జరిపే బాధ్యతను ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ కాపు నేతకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై తన నేతలతో చర్చించిన ఆయన, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని, అందుకోసం అందుబాటులో ఉండే ఏ అవకాశాన్ని కూడా వదులుకోరాదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

ఇక పవన్ కు ఉన్న అభిమానుల దృష్ట్యా, ఆయనతో కలసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని వామపక్ష పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో పవన్ తో జత కడితే, సీపీఐ, సీపీఎంలు కూడా కలసి వచ్చినట్టేనని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం ఒంటరిగా ఎన్నికలకు వెళితే, ప్రయోజనం శూన్యమని భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీని కూడా కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీకి ఎదురెళ్లాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News