: తల్లిని కాపాడబోయిన కూతురు.. విద్యుదాఘాతంతో ఇద్దరూ మృతి!


విద్యుదాఘాతంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. నారాయణపేట మండలంలోని జాజాపూర్ లో విద్యుదాఘాతంతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి కిష్టమ్మ బహిర్భూమికని చెప్పి సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లింది. అయితే, పొలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంది. దీనిని ఆమె తాకడంతో షార్ట్ సర్క్యూట్ కు గురైన కిష్టమ్మ మృతి చెందింది. తల్లిని రక్షించే క్రమంలో కుమార్తె భాగ్యమ్మ కూడా ప్రాణాలు పోగొట్టుకుంది. 

  • Loading...

More Telugu News