: కుట్ర పూరితంగా నన్ను కేసులో ఇరికించారు: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి


భూ కబ్జా కేసులో తనను కుట్ర పూరితంగా ఇరికించారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ పై వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. కాగా, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ రెడ్డిని నిన్న రాత్రి  సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు న్యాయవాది శైలేష్ సక్సేనా ను కూడా అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.

దీపక్ రెడ్డి ముందస్తు బెయిల్ గడువు పూర్తి కావడం, శైలేష్  సక్సేనా బెయిల్ తిరస్కరణకు గురవడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. దీపక్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఏపీ శాసనమండలి చైర్మన్ కు అధికారిక సమాచారం ఇచ్చినట్టు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించడంలో వీరికి సహకరించిన రియల్టర్ శ్రీనివాస్ ను కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News