: నేను పాట పాడితే మీరు కొన్నాళ్ల పాటు నిద్రపోరు.. జాగ్రత్త!: సల్మాన్ ఖాన్ స్వీట్ వార్నింగ్


తాను పాటపాడితే కొన్ని రోజుల పాటు నిద్రపోలేరని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అంటున్నాడు. ప్రస్తుతం ఆయ‌న‌ భారత్‌-చైనా యుద్ధం నేపథ్యంలో వస్తున్న ‘ట్యూబ్‌లైట్‌’ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేప‌థ్యంలో సల్మాన్ త‌న చిత్రం ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు.  ‘ట్యూబ్‌లైట్‌’ సినిమాలోని రేడియో అనే పాట ఇటీవల విడుదలైంది. ఆ పాట పాడ‌మ‌ని ఓ విలేకరి ఆయ‌న‌ను కోర‌గా స‌ల్మాన్ ఈ విధంగా స‌మాధానం చెప్పాడు. పాట‌ పాడ‌డానికి సల్మాన్‌ అస్సలు ఒప్పుకోక‌పోవ‌డ‌మే కాకుండా, ఆ పాటను తాను పాడితే టెక్నీషియన్లు కూడా నిద్రపోలేరని అన్నాడు.               

  • Loading...

More Telugu News