: కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ చేతికి?


కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పజెప్పేందుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. అక్టోబర్ లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా నివాసంలో వర్కింగ్ కమిటీ సమావేశం ఈ రోజు నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై సోనియా విమర్శలు గుప్పించారు. పార్టీ అంతర్గత ఎన్నికలను డిసెంబర్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, దాదాపు 2005వ సంవత్సరం నుంచి పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించలేదని అన్నారు. పార్టీలోని రెండు వేల మంది ప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని, కాంగ్రెస్ లోని అత్యున్నత నిర్ణయాత్మక వర్కింగ్ కమిటీని కూడా వారే ఎన్నుకుంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News