: వామ్మో! ఇన్ని బంగారు న‌గ‌లా?... విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న‌ రాజ‌కీయ నేత కూతురి పెళ్లి ఫొటో!


డ‌బ్బున్న వారు త‌మ కూతుళ్ల వివాహాన్ని అంబ‌రాన్నంటేలా చేస్తారు. త‌ర‌త‌రాలు తమ కూతురి పెళ్లిని గురించి చెప్పుకోవాల‌ని భావిస్తారు. అయితే, వామపక్ష నేతల ఇళ్లల్లో జ‌రిగే పెళ్లిళ్లలో అంత‌గా ఆర్భాటాలు క‌నిపించ‌వు. కానీ, ఈ కేరళ నేత మాత్రం భిన్నం. త‌న కూతురు పెళ్లి వేడుక‌ను ఎంత ఘ‌నంగా నిర్వ‌హించాడో ఆ పెళ్లి కూతురి ఫొటోని క‌నుక చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ ఫోటోలో వధువు పూర్వ‌కాలంలో మ‌హారాణులు ధ‌రించిన‌ట్లు ఒంటి నిండా బంగారు న‌గ‌లు ధ‌రించి ఉంది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

సీపీఐ ఎమ్మెల్యే గీతా గోపి కుమార్తె పెళ్లి రెండు రోజుల క్రిత‌మే త్రిశూర్‌లో జ‌రిగింది. పెళ్లి కూతురు ఇన్నిన‌గ‌లు ధ‌రించి రావ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. వామ్మో ఇన్ని బంగారు న‌గ‌లా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే సీపీఐ తరుఫున శాస‌న‌స‌భ్యుడిగా గెలిచిన గోపి కూతురి ఒంటిపై ఇన్ని న‌గ‌లు ఎలా వ‌చ్చాయని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆ ఎమ్మెల్యే మాత్రం సమర్థించుకున్నారు. ఇక జాతీయ న్యూస్ చానెళ్లలోనూ ఆమె పెట్టుకున్న నగలపై కథనాలు ప్రచురించేశారు.  


 

  • Loading...

More Telugu News