: నేపాల్ ప్రధానిగా షేర్ బహుదూర్.. రేపు ప్రమాణ స్వీకారం!
నేపాల్ తదుపరి ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా ఎన్నికయ్యారు. పార్లమెంట్ లో చేపట్టిన ఓటింగ్ ద్వారా నేపాలీ కాంగ్రెస్ చైర్మన్ అయిన దేవ్ బాను ప్రధానిగా ఎన్నుకున్నారు. నేపాల్ పార్లమెంట్ లో మొత్తం సభ్యుల సంఖ్య 593. ఇందులో 388 మంది సభ్యులు ఆయనకు అనుకూలంగా, 170 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. 35 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ప్రధాని పదవిని నాలుగోసారి చేపట్టనున్న దేవ్ బా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, గత నెల 24వ తేదీన ప్రధాని పదవికి ప్రచండ రాజీనామా చేశారు. గత ఏడాది ఆగస్టులో ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ, నేపాలీ కాంగ్రెస్ తో జతకట్టింది. అధికార మార్పిడిపై ఇరు పార్టీలు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రచండ తన పదవికి రాజీనామా చేశారు.