: నేత్రదానానికి ముందుకొచ్చిన హీరో విజయ్ సేతుపతి!


తమిళ హీరో విజయ్ సేతుపతి నేత్ర దానం చేయనున్నట్టు ప్రకటించాడు. మధురైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన విజయ్ సేతుపతి అక్కడి మీడియాతో మాట్లాడుతూ, అంధులు ఈ ప్రపంచాన్ని చూసేందుకు మన మరణానంతరం మనం సాయపడాలని, తన అభిమానులు కూడా తమ కళ్లను దానం చేయాలని సూచించారు. కాగా, విజయ్ సేతుపతి నటిస్తున్న‘కరుప్పన్’ అనే తమిళ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News