: ‘నాకు బతకాలని లేదు’ అంటూ ల్యాప్‌టాప్‌లో సూసైడ్ లెటర్ రాసి వెళ్లిపోయిన యువకుడు


'అమ్మానాన్నల‌ను బాగా చూసుకో త‌మ్ముడూ' అంటూ త‌న సోద‌రుడికి ల్యాప్‌టాప్‌లో ఆత్మ‌హ‌త్య లేఖ రాసి ఓ యువ‌కుడు క‌నిపించ‌కుండా పోయిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని అంబ‌ర్‌పేట‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఆ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే, నిఖిల్ అనే ఓ యువకుడు ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. న‌గ‌రంలోని అంబర్ పేటలో ఓ రూమ్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం త‌న‌ రూమ్ నుంచి వెళ్లిన నిఖిల్ ఇప్ప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో అతడి స్నేహితులు, తమ్ముడు ఆ రూమ్‌కు వెళ్లి చూశారు.

నిఖిల్ త‌న‌ ల్యాప్‌టాప్‌లో సూసైడ్ లెటర్ రాసిన‌ట్లు గ‌మ‌నించారు. సూసైడ్ లెట‌ర్ లో నిఖిల్‌.. త‌న‌ తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇక‌ తనకు బతకాలని లేదని రాశాడు. త‌మ కుటుంబ స‌భ్యులంద‌రినీ జాగ్రత్తగా చూసుకోవాలని తన తమ్ముడికి సూచించాడు. ఈ విష‌యం గురించి తెలుసుకున్న నిఖిల్ తల్లితండ్రులు తమ పెద్ద కుమారుడి కోసం ఆందోళ‌న చెందుతున్నారు.          

  • Loading...

More Telugu News