: జగన్, విజయసాయిరెడ్డి తోడుదొంగలు: టీడీపీ ఎమ్మెల్యే బండారు
వైఎస్సార్సీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తోడుదొంగలని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. తనపై, తన కుటుంబసభ్యులపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జగన్, విజయసాయిరెడ్డి తోడుదొంగలు, ఆర్థిక నేరస్తులని ఆయన ఆరోపించారు.