: ఇప్పటి వ‌ర‌కు ఎంతో సహనంగా ఉన్నా.. ఇక కఠినంగా ఉంటా!: సినీ న‌టి అనుష్క‌


భారీ విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న సినీ న‌టి అనుష్క‌కి కోప‌మొచ్చింది. సోష‌ల్ మీడియాలో ఆమెపై పలువురు అదే ప‌నిగా పుట్టిస్తోన్న పుకార్లపై ఆమె నోరు విప్పింది. తాను ఇప్పటి వ‌ర‌కు ఎంతో సహనంగా ఉన్నాన‌ని, ఇక‌పై మాత్రం అటువంటి పుకార్లను వ్యాప్తి చేసే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తాన‌ని తెలిపింది.

త్వరలో ప్రభాస్ తో ఆమె వివాహం జరగనుందంటూ ఇటీవల బాగా వార్తలొచ్చాయి. దీనిపై ఈ అమ్మ‌డు మాట్లాడుతూ... ప్ర‌భాస్‌కి, త‌న‌కు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్ర‌మేన‌ని ఆ వెంటనే వివరణ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆమెపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ప్రస్తుతం ఆమె ‘భాగమతి’ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉంది.                                    

  • Loading...

More Telugu News