: ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన వర్షపాతం వివరాలు


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లల్లో ఈ రోజు భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో.. విజయవాడ -7 సెం.మీ, చోడవరం - 6 సెం.మీ, పెద్దాపురం, సత్తెనపల్లి, గుంటూరు, ఆత్మకూరులో 4 సెం.మీ, ఎస్ కోట, నందిగామ, నర్సీపట్నం, తిరుపతిలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తెలంగాణ విషయానికొస్తే.. ఆదిలాబాద్ బోథ్ లో 7 సెం.మీ, భువనగిరి, శంషాబాద్ లో 4 సెం.మీ, చేవెళ్ల, మహేశ్వరంలో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

  • Loading...

More Telugu News