: కారులో ఇరుక్కుపోయి.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన చిన్నారి


ఢిల్లీలోని రోహణి రాణిబాగ్‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆడుకోవ‌డానికి ఇంటి బ‌య‌ట‌కు వెళ్లిన సోనూ (6) అనే బాలుడు కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. త‌మ కుమారుడు ఎంత‌కీ ఇంట్లోకి రాక‌పోవ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన సోనూ త‌ల్లిదండ్రులు త‌మ ఇంటిపక్కన నిలిపి ఉంచిన కారులో చూడ‌గా ఆ బాలుడు క‌నిపించాడు. వెంటనే అత‌డిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సోనూ ప్రాణాలు కోల్పోయాడ‌ని వైద్యులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు... ఆ బాలుడు అనుకోకుండా కారులోకి వెళ్లాడ‌ని, బయటకు వచ్చే క్రమంలో ఊపిరాడక మృతి చెందాడ‌ని త‌మ‌ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.                   

  • Loading...

More Telugu News