: ఈ నెల 8న ఉచిత చేప ప్రసాదం పంపిణీ... లక్షన్నర చేప పిల్లలను సిద్ధంగా ఉంచాం: మంత్రి తలసాని
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ నెల 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం, తలసాని మాట్లాడుతూ, చేప ప్రసాదం కోసం వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేశామని, లక్షన్నర చేప పిల్లలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. కాగా, బత్తిని సోదరులు విశ్వనాథం గౌడ్, హరినాథ్ గౌడ్ జూన్ 8వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున బత్తిని వంశస్థుల ఆధ్వర్యంలో ఉబ్బస వ్యాధి గ్రస్తులకు ఉచితంగా చేప మందును పంపిణీ చేయడం ఆనవాయతీగా వస్తోంది.