: సీనియారిటీ కాదు సిన్సియారిటీ ముఖ్యం: రోజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి లోటు బడ్జెట్‌పై కేంద్రాన్ని ఆయన నిలదీయలేకపోతున్నారని అన్నారు. తాను దేశంలోనే సీనియర్ నేతనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ, మనిషికి ఉండాల్సింది సీనియారిటీ కాదని, సిన్సియారిటీ ముఖ్యమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రికి అవినీతిలో సీనియారిటీ ఉందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో జరిగిన భూకబ్జా దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆమె అన్నారు. ఇందులో నారా లోకేశ్ సహా ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు సూత్రధారులని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం ఎందుకు సిద్ధపడట్లేదని ఆమె అడిగారు.