: అమ్మ‌ను తిట్టినందుకు తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన త‌న‌యుడు


మంచిర్యాలలోని బెల్లంపల్లిలో ఓ 17 ఏళ్ల కుర్రాడు త‌న తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ప్ర‌స్తుతం ఆ తండ్రి ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయ‌న శ‌రీరం 50 శాతానికి పైగా కాలిపోయింద‌ని వైద్యులు తెలిపారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, బెల్లంపల్లిలో మెకానిక్‌గా ప‌నిచేస్తోన్న‌ ఆకుల రమేష్ త‌రుచూ త‌న భార్య‌తో గొడ‌వ ప‌డేవాడు. వారిద్ద‌రి మ‌ధ్య డబ్బు విషయమై కొన్నాళ్లుగా వివాదం చెల‌రేగుతోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న ర‌మేష్ త‌న‌ భార్యను కొట్టాడు. అయితే, త‌న త‌ల్లిని త‌న తండ్రి కొట్ట‌డాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోయిన వారి కొడుకు అఖిల్.. తండ్రిని నిలదీసి బెదిరించాడు. ‘నా ఇష్టం అలాగే చేస్తా’ అంటూ వెళ్లిపోయిన ర‌మేష్ రాత్రికి ఇంటికి వచ్చాడు. త‌న తండ్రి ఇంటికి రాగానే అఖిల్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు.        

  • Loading...

More Telugu News