: వంద ఎకరాల భూమిలో రాజమౌళి ఫామ్ హౌస్!
'బాహుబలి' సినిమాతో తన పేరును భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు దర్శకదిగ్గజం రాజమౌళి. కొన్నేళ్ల తరబడి ఈ సినిమా కోసం కష్టపడ్డ రాజమౌళి... ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలు చేస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇకపై షూటింగ్ విరామాల్లో విశ్రాంతి తీసుకునేందుకు ఫామ్ హౌస్ నిర్మించుకునే పనిలో రాజమౌళి పడ్డట్టు తెలుస్తోంది. హైదరాబాదుకు వంద కిలోమీటర్ల దూరంలో రాజమౌళి ఇప్పటికే వంద ఎకరాల భూమిని కొనుగోలు చేశాడట. ఈ భూమిలోనే ఫామ్ హౌస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఫామ్ హౌస్ లో అన్ని రకాల మొక్కలను పెంచాలని... కొంత భాగంలో వ్యవసాయం కూడా చేయాలని ఆయన భావిస్తున్నాడట.