: అసెంబ్లీలోని జగన్ కార్యాలయంలోకి వర్షపు నీరు.. అమరావతిలో కుండపోత వర్షం!
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా సెక్రటేరియట్ లోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు సన్నటి ధారగా కారుతోందని సమాచారం. మరోవైపు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి పరిసరాల్లో ఉన్న గ్రామాల్లో పిడుగుపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో సైతం పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.