: మాదాపూర్ లో ‘ఓలా’ ఆఫీసు వద్ద క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓలా క్యాబ్ ఆఫీసు వద్ద డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కిలోమీటర్ కు రూ.17 ఇస్తామని చేసుకున్న ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం సదరు సంస్థ నడవటం లేదని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్ కు కేవలం రూ.9 మాత్రమే ఇస్తున్నారని, అందుకే, ధర్నాకు దిగామని డ్రైవర్లు చెప్పారు. అంతేకాకుండా, పని వేళలు కూడా ఎక్కువ చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ‘ఓలా’ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.