: మధ్యప్రదేశ్ రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తం: పోలీసు కాల్పుల్లో నలుగురు రైతుల మృతి
మధ్యప్రదేశ్‌లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రైతుల సంఖ్య నాలుగుకి చేరినట్లు తెలిసింది. అయితే, రైతులపై పోలీసులు కాల్పులకు పాల్పడలేదని అక్కడి అధికారులు ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఆందోళన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, దర్యాప్తు ప్రారంభించామని చెబుతున్నారు. రైతుల ఆందోళన కారణంగా ఎటువంటి వదంతులు వ్యాపించకుండా మాండ్ సౌర్ సహా పలు ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. మరోవైపు రైతులు ఈ రోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.