: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. మ‌రోవైపు ఈ రోజు గుంటూరులో ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసింది. తొలకరి వానలతో రైతుల్లో ఆనందం నిండుతోంది. అయితే, కాసేపట్లో గుంటూరులోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌ల‌తో నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్ర‌జ‌లు ఈ రోజు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణాన్ని చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో ప‌లు చోట్ల ఈ రోజు జ‌ల్లులు పడ్డాయి.         

  • Loading...

More Telugu News