: హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
అమీన్ పూర్ సర్పంచ్ ను బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. సంగారెడ్డిలో ఇటీవల నిర్వహించిన రాహుల్ సభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ లో ఉలికిపాటు మొదలైందని అన్నారు. మంత్రి హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.