: జులై నుంచి కొత్త మద్యం పాలసీ అమలు: మంత్రి జవహర్


ఏపీలో జులై నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్టు మంత్రి జవహర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం పాలసీ ఉంటుందని, మద్యం కల్తీకి పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామని, బెల్టుషాపులు నిర్వహిస్తున్న 200 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. గత ఏడాది రూ.13,958 కోట్ల ఆదాయం వచ్చిందని, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి గంజాయి, సారా అక్రమ రవాణా అడ్డుకుంటామని, పర్యాటక ప్రాంతాల్లో బీర్ పార్లర్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, వారంలో రెండు రోజులు మాత్రమే బయట కనబడతారని అన్నారు.

  • Loading...

More Telugu News