: లాలూ కుమార్తెకు మళ్లీ ఐటీ సమన్లు
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి ఐటీ శాఖ మరోమారు సమన్లు జారీ చేసింది. బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ రోజు విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో పదివేల రూపాయలు జరిమానాగా విధిస్తూ, ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ మళ్లీ సమన్లు జారీ చేసింది.