: రైతులపై పోలీసుల కాల్పులు... ఒకరి మృతి.. పలువురికి తీవ్రగాయాలు
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా రైతులు చేస్తోన్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఇటీవలే ఆ రాష్ట్రంలో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని, చల్లబడింది. అయితే, మళ్లీ ఈ రోజు ఆ రాష్ట్రంలోని మాండ్ సౌర్ లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఒక రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరికొందరు రైతులు తీవ్రగాయాలపాలయ్యారు. ఆ రాష్ట్ర రైతులు ముఖ్యంగా గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్నారు.