: ఆర్మీ చీఫ్ పై ప్రకాశ్ కారత్ సంచలన వ్యాఖ్యలు!


ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పై సీపీఎం నేత ప్రకాశ్ కారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రావత్ సైన్యాధిపతిగా కాకుండా మోదీ ప్రభుత్వంలో భాగంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సైన్యాన్ని వినియోగించడంలో రావత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఆయన నిర్ణయాలతో సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కశ్మీర్ లో ఆర్మీ జీపుకు ఓ యువకుడిని కట్టేసి, మానవ రక్షణ కవచంగా ఉపయోగించిన మేజర్ లీతుల్ గొగోయ్ కు రావత్ మద్దతు తెలపడం దారుణమని తెలిపారు. సైన్యంపై రాళ్లు రువ్వేవారిని, ఆయుధాలు చేతబట్టిన టెర్రరిస్టులను ఒకే విధంగా రావత్ చూస్తున్నారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News