: తూ.గో. జిల్లాలో దారుణం: ప్రియురాలి తండ్రి చేతిలో హత్యకు గురైన ప్రియుడు!
తన ప్రియురాలి తండ్రి చేతిలో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలోని పల్లి పాలెంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కె.రామాంజనేయులు (23) అనే యువకుడు నాలుగురోజుల క్రితం కనిపించకుండాపోయాడు. తమ కుమారుడు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ యువకుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతను హత్యకు గురైనట్లు గుర్తించారు. రామాంజనేయులు మృతదేహాన్ని గొల్లెపాలెలోని ఓ మారుమూల ప్రాంతంలో ఖననం చేసినట్లు చెప్పారు.
ఆ యువకుడు గొల్లపాలెం గ్రామానికి చెందిన జ్యోతితో ప్రేమలో ఉన్నాడని, ఆ యువతి తండ్రి మరికొంత మందితో కలిసి తన కుమారుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడని మృతుడి తండ్రి కె.నూకాలరావు అంటున్నారు. ఆ యువకుడి మృతదేహానికి పోర్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.