: అందుకే మా జంట హిట్ అయిందేమో!: హెబ్బా పటేల్
టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న వారిలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంట ముందు నిలుస్తుందనడంలో సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద వసూళ్ల కలెక్షన్లు సాధించడంలో ముందు నిలువగా, ఎంతో మంది నిర్మాతలు వీరితో తమ చిత్రాలను తీసేందుకు క్యూకడుతున్న పరిస్థితి. అయితే, ఇక కనీసం రెండేళ్ల పాటు రాజ్ తరుణ్ తో మరో సినిమా చేయబోనని హెబ్బా వ్యాఖ్యానించడం గమనార్హం.
వీరిద్దరూ కలసి నటించిన తాజా చిత్రం 'అంధగాడు' హిట్ అయిన నేపథ్యంలో, ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన హెబ్బా, రాజ్ తరుణ్ ల జోడీకి, తదుపరి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన హెబ్బా, మరో రెండేళ్లు రాజ్ తో కలసి సినిమా చేసేందుకు సైన్ చేయనని, కనీసం ఏడాదన్నా గ్యాప్ తీసుకుంటానని చెప్పింది. రాజ్ తో తాను ఓ మంచి ఫ్రెండ్ లా ఉంటానని, అందుకే తమ జంట హిట్ అయ్యుండవచ్చని అంచనా వేసింది.