: భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న టిఫిన్ ఇదే!


ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా భారతీయుల్లో అత్యధికులు దోశనే ఇష్టపడుతున్నారట. టిఫిన్ కోసం హోటల్ కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా దోశనే ఆర్డర్ చేస్తున్నారట. టిఫిన్లపై జరిపిన ఆన్ లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్విగ్గీ అనే ఆన్ లైన్ డెలివరీ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. దోశ తర్వాతి స్థానాన్ని పోహా, పరోటాలు ఆక్రమించాయి. వారాంతాల్లో అయితే దోశల అమ్మకాలు మరింత పెరుగుతాయట. 

  • Loading...

More Telugu News