: తన భార్య ఆర్తిని చిలిపిగా దెప్పిపొడిచిన వీరేంద్ర సెహ్వాగ్


గతంలో తన ఆటతీరుతో అభిమానులను అలరించి, ఇప్పుడు క్రికెట్ కామెంటేటర్ గా, ట్విట్టర్ లో తనదైన వ్యంగ్య ట్వీట్లతో అభిమానులను ఆహ్లాద పరుస్తున్న వీరేంద్ర సెహ్వాగ్, ఈ సారి తన బార్య ఆర్తీనే టార్గెట్ చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం సౌరవ్ గంగూలీ, షేన్ వార్న్ లను విమర్శించిన సెహ్వాగ్, తన భార్యను చిలిపిగా దెప్పిపొడిచాడు. తనను రారాజని ఆర్తి సంబోధించగా, స్పందించిన సెహ్వాగ్, "నన్ను రాజునని నా భార్య చెప్పింది. ఇది చెస్ తరహా ఆట. రాజు కేవలం ఒక్క అడుగు మాత్రమే జరుగుతాడు. రాణి మాత్రం తాను ఎటు వెళ్లాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా చేస్తుంది" అని పోస్టు పెడుతూ, తాను కుర్చీలో కూర్చోగా, తన పక్కనే ఆర్తి ఉన్న చిత్రాన్ని పోస్టు చేశాడు. గతంలోనూ తన భార్యను టార్గెట్ చేసుకుని, భార్య పక్కనుంటే నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్నట్టేనని సెహ్వాగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News