: ధోనీని ఆపి ... పాండ్యాను వెంటనే ప్యాడ్లు కట్టుకోవాలని ఆదేశించిన అనిల్ కుంబ్లే!


చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ జరుగుతున్న వేళ, వేగంగా అర్థ శతకం చేసిన యువరాజ్ అవుట్ కాగానే, ధనాధన్ ధోనీ క్రీజులోకి రావాల్సిన వేళ, హార్దిక్ పాండ్యా వచ్చి, వరుసగా మూడు సిక్సులు బాది, భారత స్కోరును 300 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ధోనీ బదులు పాండ్యా రావడం వెనుక హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్లాన్ ఉన్నట్టు సమాచారం. ఆట 46వ ఓవర్ లో పాండ్యా వద్దకు వచ్చిన కుంబ్లే, వెంటనే ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉండాలని చెప్పాడట.

చివరి మూడు ఓవర్లలో ఎప్పుడు వికెట్ పోయినా, ధోనీ స్థానంలో పాండ్యా ఉంటే స్కోరు పరుగులు పెడుతుందని భావించిన కుంబ్లే, ధోనీని ఆపి మరీ పాండ్యాకు అవకాశం ఇచ్చాడు. "46వ ఓవర్లో తరువాత నువ్వే వెళ్లాలి అని కోచ్ చెప్పారు. ఆ వెంటనే ప్యాడ్లు కట్టుకున్నా, గ్లౌస్ తొడుక్కుంటుంటే, యూవీ పాపా అవుట్ అయ్యాడు. వెంటనే నేను వెళ్లాను" అని పాండ్యా చెప్పాడు. ఆ సమయంలోనూ తనపై ఒత్తిడి వుందని, అయితే, వచ్చిన బంతిని వచ్చినట్టు బాదాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కాగా, చివరి బంతుల్లో పాండ్యా ఆడిన తీరుకు పదికి పది మార్కులు ఇస్తున్నట్టు కోహ్లీ తెలిపాడు. పాక్ తో మ్యాచ్ లో పాండ్యా ఆరు బంతుల్లో 3 సిక్సుల సాయంతో 20 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News