: పాక్ జట్టుకు షాక్.. గాయంతో ట్రోఫీ నుంచి తప్పుకున్న ప్రధాన బౌలర్!
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చేతిలో ఘోరంగా ఓడి, తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ వహబ్ రియాజ్ చీలమండ గాయం కారణంగా ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ రియాజ్ గాయపడ్డాడు. ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అయితే భారత్ తో జరిగిన మ్యాచ్ లో రియాజ్ విఫలమైన సంగతి తెలిసిందే. 8.4 ఓవర్లలో అతను 87 పరుగులు ఇచ్చాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ రియాజ్ ను ఓ ఆట ఆడుకున్నారు.