: అనంతపురం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పాలాల్లోకి పరుగులు తీసిన జనాలు!
అనంతపురం జిల్లాలో ఈ ఉదయం భూమి కంపించింది. బెళుగుప్ప మండలం జీడిపల్లిలో పెద్ద శబ్దంతో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి, పక్కనున్న పొలాల్లోకి పరుగులు పెట్టారు. భూ ప్రకంపనల తీవ్రతకు గ్రామంలోని పలు సీసీ రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. తొమ్మది సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాది కాలంలో భూమి కంపించడం ఇది రెండోసారని వారు చెప్పారు.