: హెలికాప్టర్ లో వెళ్లే చాన్స్ లేదు... చంద్రబాబు విశాఖ పర్యటన అర్థంతరంగా రద్దు!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటన అర్థంతరంగా రద్దయింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున హెలికాప్టర్ లో చంద్రబాబు ప్రయాణించేందుకు అధికారులు అంగీకరించలేదు. ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు ఉన్నందున హెలికాప్టర్ లో వెళ్లడం క్షేమకరం కాదని అధికారులు చెప్పడంతో, బాబు తన పర్యటనను విరమించుకున్నారు. కాగా, నేడు విశాఖలో ఆయన నవనిర్మాణ దీక్షలో పాల్గొనాల్సి వుందన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అమరావతి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.