: ప్రతి మ్యాచ్ కీ వస్తా: విజయ్ మాల్యా
బ్రిటన్ లోని ఎడ్ బాస్టన్ మైదానంలో భారత్, పాక్ జట్ల మధ్య చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతున్న వేళ, వీఐపీ స్టాండ్స్ లో విజయ్ మాల్యా కనిపించడం, ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తుండటంపై భారత మీడియాలో విపరీతంగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మాల్యా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. మీడియా కవరేజ్ అద్భుతమని అన్నాడు. భారత క్రికెట్ టీమును ఉత్సాహపరిచేందుకు అన్ని మ్యాచ్ లకూ వస్తానని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ ఆటగాడని, అంతకుమించి ప్రపంచ స్థాయి నాయకుడని కొనియాడారు. కాగా, ఇండియాలోని పలు బ్యాంకులకు వడ్డీలు సహా రూ. 9 వేల కోట్లు బకాయిపడి, వాటిని తిరిగి చెల్లించలేని స్థితిలో మాల్యా దేశం విడిచి పారిపోయి లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.