: పాకిస్థాన్‌కు ఐసీజేకు వెళ్లే దమ్ములేదు.. తేల్చి చెప్పిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్


కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లే దమ్ము పాకిస్థాన్‌కు లేదని విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఆ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మరోమారు తేల్చి చెప్పారు. మోదీ మూడేళ్లపాలనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుష్మ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశంతో ఉన్న అన్ని సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని పేర్కొన్న మంత్రి ఉగ్రవాదం, చర్చలు రెండూ కుదరని పని అని కుండబద్దలు గొట్టారు. చర్చలు కావాలంటే ఉగ్రవాదానికి పాక్ పుల్‌స్టాప్ పెట్టాల్సిందేనన్నారు.

‘‘కశ్మీర్ అంశాన్ని పాక్ ఐసీజేకు తీసుకెళ్లలేదు. దానిని ఇరు దేశాలు చర్చలు ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది’’ అని సుష్మ పేర్కొన్నారు. ఆస్తానా ఎస్‌సీవో సదస్సులో భారత్-పాక్ ప్రధానులు మోదీ, షరీఫ్‌ల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందన్న వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ ఇప్పటి వరకైతే అందులో స్పష్టత లేదన్నారు.

  • Loading...

More Telugu News