: కుప్పకూలిన వేదిక...సురక్షితంగా బయటపడ్డ మధ్యప్రదేశ్ సీఎం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఏర్పాటు చేసిన సదస్సులో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా సభా వేదిక ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితర నాయకులు, అధికారులు సురక్షితంగా బయటపడ్డారు.