: రాహుల్ గాంధీవి కుర్రచేష్టలు: అశోక్ గజపతిరాజు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీవి కుర్రచేష్టలని కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు విమర్శించారు. కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి చంద్రబాబు ఫోబియా పట్టుకుందని, చంద్రబాబు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసని, రాష్ట్ర పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ నేతలను ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు కనుకనే ప్యాకేజ్ ఇచ్చారని అన్నారు.